Pooja Hegde : పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైంది. వరుస ఫ్లాప్ప్తో సతమతమవుతోన్న పూజా హెగ్డే ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ ఫోటోలపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అదరగొట్టావ్ పూజా అంటే.. మరికొందరు మాత్రం.. ఇదేం డ్రెస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ భామ సినిమాల విషయానికి వస్తే.. రాధేశ్యామ్ మొదలుకొని, ఆ తర్వాత వచ్చిన బీస్ట్, ఆచార్య ఇలా వరుసగా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంటున్నాయి. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి.. పరిస్థితేమి బాగాలేదు.. దీనికి తోడు వచ్చిన సినిమా అవకాశాలు పోతున్నాయి.
ఇటీవల గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దర్శక నిర్మాతలు పూజాను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూజా హెగ్డే గురించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ భామకు ఆఫర్స్ రాకపోవడానికి ఓ భారీ కారణమే ఉందని టాక్ నడుస్తోంది.
అనుకున్న రెమ్యూనరేషన్‌ను మించి అడుగుతుందట. ఆమెతో పాటు వచ్చే స్టాఫ్ ఖర్చులు, ఈమె హోటల్ ఖర్చులు, తిండి ఖర్చులు, ఇలా అన్నీ కూడా నిర్మాతలే చూసుకోవాలని డిమాండ్ చేస్తుందట. దీంతో ఇదంతా ఎందుకు అంటూ కొత్త హీరోయిన్ శ్రీలీలను తీసుకుంటున్నారట దర్శక నిర్మాతలు.
ఇక అది అలా ఉంటే పూజా హెగ్డేకు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే, కుర్ర హీరో సిద్ధు జొన్నలగడ్డతో ఓ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారట. కథను బివియస్ రవి అందిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ అవకాశం సమంతకు వచ్చిందట. అయితే ఆమె ప్రస్తుం ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండడంతో.. పూజా హెగ్డేకు ఈ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక పూజా గతంలో నటించిన సినిమాల విషయానికి వస్తే.. ఈ భామకు ‘దువ్వాడ జగన్నాథం’ నుంచి ‘అల వైకుంఠపురములో’ సినిమా వరకు.. దాదాపుగా పూజా హెగ్డే చేసిన ప్రతి సినిమా హిట్టే అయ్యింది. దీంతో పూజా హెగ్డేను గోల్డెన్ లెగ్ అని తెలుగులో అందరూ ప్రశంసలు కురిపించారు. ఇక ఆ తర్వాత మొదలైంది అసలు కథ.. తెలుగులో పూజా హెగ్డే విజయ పరంపర చూసి హిందీ దర్శక నిర్మాతలు అక్కడ అవకాశాలు ఇవ్వడం మొదలు పెట్టారు. అయితే ఈ భామకు మాత్రం ఏ సినిమా కలిసిరావడం లేదు. దీంతో ప్రభాస్ ‘రాధే శ్యామ్’ నుంచి లేటెస్ట్ సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ వరకు అన్నీ ఫ్లాపులే పడ్డాయి.
ఇక పూజా గతంలో నటించిన సినిమాల విషయానికి వస్తే.. ఈ భామకు ‘దువ్వాడ జగన్నాథం’ నుంచి ‘అల వైకుంఠపురములో’ సినిమా వరకు.. దాదాపుగా పూజా హెగ్డే చేసిన ప్రతి సినిమా హిట్టే అయ్యింది. దీంతో పూజా హెగ్డేను గోల్డెన్ లెగ్ అని తెలుగులో అందరూ ప్రశంసలు కురిపించారు. ఇక ఆ తర్వాత మొదలైంది అసలు కథ.. తెలుగులో పూజా హెగ్డే విజయ పరంపర చూసి హిందీ దర్శక నిర్మాతలు అక్కడ అవకాశాలు ఇవ్వడం మొదలు పెట్టారు. అయితే ఈ భామకు మాత్రం ఏ సినిమా కలిసిరావడం లేదు. దీంతో ప్రభాస్ ‘రాధే శ్యామ్’ నుంచి లేటెస్ట్ సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ వరకు అన్నీ ఫ్లాపులే పడ్డాయి.
పూజా మిస్ ఇండియా పోటీలలో 2009 లో పాల్గొన్నా మొదటి రౌండ్స్ లోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. బిర్యానీ, పిజ్జా లను ఎక్కువగా ఇష్టపడే పూజ కనీసం రోజూ రెండు గంటలు యోగా, వర్కౌట్స్ కు కేటాయిస్తుంది. తన బరువును ఎప్పుడు కంట్రోల్ లో ఉంచుకొనే ఈ బ్యూటీ బరువు 53 కేజీలు మరియు ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు.
క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, టెన్నిస్ స్టార్ రోజెర్ ఫెదరర్ ను ఆరాధించే పూజా ఏ ఆర్ రెహ్మాన్ సంగీతానికి, జెన్నిఫర్ లోపెజ్ పాటలకు పిచ్చ ఫ్యాన్. ఇంకా హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ సినిమా పరంగా ఎక్కువగా ఇష్టపడుతుంది. ఖాళీ సమయాలలో డాన్స్, పుస్తకాలు చదవడం, ట్రావెలింగ్ ఎక్కువగా చేసే పూజా పెడ్రో అనే కుక్కను కూడా పెంచుతోంది. ఖాళీ దొరికినప్పుడు మూగ జీవాలకు సేవ కూడా చేస్తుంటుంది.
హీరోయిన్గా పూజా హెగ్డే ఫస్ట్ మూవీ తమిళ మూవీ ‘మూగముడి’. జీవా హీరోయిన్గా నటించిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాలో గోపికమ్మగా తెలుగు ప్రేక్షకులను అలరించిన పూజా హెగ్డే. ఆ తర్వాత బాలీవుడ్లో హృతికో రోషన్ హీరోగా నటించిన ‘మొహంజోదారో’ సినిమాలో కథానాయికగా నటించింది
also resd-
Anupama Parameswaran : డీజే టిల్లు-2 హీరోయిన్ కి పెళ్లైపోయిందా ? మెడలో తాళి.. అనుపమ ఇది ఏందమ్మా?
Rashmi Gautam : యాంకర్ రష్మీ రూటు మార్చేసిందా..? చాలా రోజుల తర్వాత బ్యూటీ అందాల హవా..!